బ్రేకింగ్: రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. టెలిఫోన్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

by Satheesh |   ( Updated:2023-05-01 10:30:14.0  )
బ్రేకింగ్: రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. టెలిఫోన్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగు రోడ్డును 30 ఏళ్ళ పాటు లీజుకు ఇచ్చిన నిర్ణయంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కొత్త సచివాలయంలో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తున్న రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. టెలిఫోన్ భవన్ దగ్గరకు రాగానే పోలీసులు ఆయన వాహనాన్ని ఆపివేశారు. సచివాలయంలోకి వెళ్ళడానికి అనుమతి లేదని, ఇప్పుడు వెళ్ళడానికి తాము పర్మిషన్ ఇవ్వమంటూ రేవంత్‌కు నచ్చచెప్పారు.

ఔటర్ రింగు రోడ్డు లీజు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు ఇవ్వడానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని కలవాలనుకుంటున్నానని, అన్ని ఆధారాలను ఆయనకు సమర్పించాలనుకుంటున్నానని పోలీసులకు వివరించారు. ఆ కంప్లైంట్ కాపీని కూడా పోలీసులకు రేవంత్ చూపించారు. కానీ అనుమతి లేదన్న కారణంతో ఆయనను సచివాలయానికి వెళ్ళకుండా ఆపివేశారు.

మరోవైపు సెక్రెటేరియట్ దగ్గర బారికేడ్లను పెట్టి పోలీసులు అలర్ట్ అయ్యారు. విజిటర్స్ ఎంట్రీ అయ్యే గేటును కూడా మూసివేశారు. కొత్త సచివాలయం ఫంక్షనింగ్‌లోకి వచ్చిన మొదటి రోజునే రేవంత్ ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. కానీ ఆయన మొదటి ప్రయత్నంలో ఊహించని పరిణామం చోటుచేసుకున్నది. సచివాలయం దగ్గర హై టెన్షన్ నెలకొన్నది.

Advertisement

Next Story

Most Viewed