Telangana Police: చనిపోయాడు అనుకున్న వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు

by Ramesh Goud |
Telangana Police: చనిపోయాడు అనుకున్న వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రమాదంలో స్పృహ కోల్పోయిన వ్యక్తికి ఇద్దరు పోలీసులు సంఘటన స్థలంలోనే సీపీఆర్ చేసి కాపాడిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గోడ మీద నుంచి పడి స్పృహ కోల్పోయాడు. దీంతో అందరూ ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడని అనుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వ్యక్తిని పరిశీలించి చూడగా.. గుండె కొట్టుకుంటుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తికి సీపీఆర్ చేయడం ప్రారంభించారు. ఓ కానిస్టేబుల్ అతని చాతి భాగంపై ప్రెస్ చేస్తుండగా.. మరో పోలీసు అతనికి ఊపిరి అందించాడు. ఈ విధంగా దాదాపు రెండు నిమిషాల పాటు చేయడంతో ఆ వ్యక్తి స్పృహలో నుంచి బయటకి వచ్చాడు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాక సమయానికి సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. దీనిపై ములుగు జిల్లా ఎస్పీ స్పందిస్తూ.. చనిపోయాడు అనుకున్న వ్యక్తికి సమయ స్పూర్తి ప్రదర్శించి సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్లను అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed