- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత రాష్ట్ర నేతలకు నో ఎంట్రీ.. వారికి మాత్రం రెడ్ కార్పెట్.. సచివాలయంలో ఆంక్షల మాయాజాలం!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సచివాలయం.. అదొక అద్భుత కట్టడం.. దేశంలో ఇంకెక్కడా ఇలాంటి నిర్మాణం లేదనే విధంగా నిర్మించిన అద్భుత కట్టడమని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలు. ఈ మాటలు ఏలావున్నా అసలు సచివాలయం దర్శించేందుకు సొంత రాష్టానికి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రం నో ఎంట్రీ.. అదే పరాయి రాష్టానికి చెందిన నాయకులకు మాత్రం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్న అధికారుల తీరుపై ఇటు ప్రజల్లో అటు స్థానిక ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
నూతన సచివాలయాన్ని మొదట్ల గోషా మహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ సచివాలయానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత బీజేపీ కార్పొరేటర్లు తమ సమస్యలపై కమిషనర్‌కు విన్నవించేందుకు వెళ్తే వారికీ అదే సీన్ రిపీట్ అయ్యింది. వినతిపత్రం ఇచ్చేదాకా అక్కడి నుండి వెళ్ళేది లేదని అనడంతో సచివాలయ అధికారులు ఒక అటెండర్‌ను పంపించి అతనికి వినతిపత్రం ఇవ్వాలనడంతో చేసేది లేక వారు ఆ వినతిపత్రాన్ని ఇచ్చారు. ఇక పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి కుడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
సొంత రాష్టానికి చెందిన ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు సచివాలయం ఎంట్రీ ఒక గగనంగా మారింది. అదే పక్క రాష్టానికి చెందిన మహారాష్ట్ర కిసాన్ సంఘటన ప్రతినిధులకు గులాబీ కండువా కప్పుకుంటే మాత్రం సచివాలయ అధికారులు ఆఘమేఘాల మీద వారికీ పాసులు ఇవ్వడం పట్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు అలాగే ప్రజాప్రతినిధులు ఇవేమి ఆంక్షల మాయాజాలం అంటూ ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. సొంత నేతలు వద్దు పక్క నేతలు ముద్దు అన్న చందంగా తయారయ్యిందని చెబుకోవడం నాయకుల వంతయ్యింది.