- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్ సభలోనూ బీఆర్ఎస్ గా మార్పు.. సర్క్యూలర్ విడుదల చేసిన డిప్యూటీ సెక్రటరీ
దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్రసమితిగా మారింది. ఈ మేరకు పార్లమెంట్ హౌజ్ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. లోక్ సభలో బీఆర్‌ఎస్ తరఫున 9మంది సభ్యులు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. బీఆర్‌ఎస్ నేతగా నామా నాగేశ్వర్ రావు ఉన్నారని తెలిపింది. పార్టీ పేరు మార్చాలని లోక్ సభ చైర్మన్‌కు ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర్ రావు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చైర్మన్ ఆమోదంతో పార్లమెంట్ హౌజ్ బులిటెన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, పార్టీల వారీగా సభ్యుల సంఖ్యను లోక్ సభ డిప్యూటీ సెక్రేటరీ ఉత్తమ్ చంద్ర రాయ్ ప్రకటించారు. గతేడాది అక్టోబర్ టీఆర్‌ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మారుస్తున్నట్లు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.