ఈ నెల 12న పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్.. పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు

by Javid Pasha |
ఈ నెల 12న పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్.. పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరష్కరించకుండ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈనెల 12వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘ ఐక్య కార్యచరణ సమితి నాయకులు తెలిపారు. శనివారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా విద్యారంగంపై సమీక్ష చేయకుండా కేసీఆర్ విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.

ఈ బంద్ విజయవంతానికి విద్యార్థులు, తల్లితండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు పాఠశాలల్లో, కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో సొంతభవనాలు నిర్మించాలని పెంచిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలనీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed