వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సీరియస్.. BRS సర్కార్‌కు కీలక ఆదేశం..!

by Satheesh |
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సీరియస్.. BRS సర్కార్‌కు కీలక ఆదేశం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు సంభవిస్తున్నాయని, కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని పిటిషనర్ తరుఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తెలిపారు.

నాణ్యమైన ఆహారం లేకపోవడంతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని కోర్టుకు వివరించారు. ఇటీవల నాగర్‌ కర్నూల్ జిల్లా మన్ననూర్, మోర్తాడ్, హుజురాబాద్, మంచాలలో అధికారులు స్టూడెంట్స్‌కు కలుషిత ఆహారాన్ని అందించారని, దీంతో దాదాపు 300 స్టూడెంట్స్‌కి పైగా కడుపునొప్పి, తలనొప్పి, ఫుడ్ పాయిజన్‌తో తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా.. గురుకుల హాస్టల్స్‌లో సరైన సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్‌లో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. గురుకుల హాస్టల్స్ స్టేటస్‌పై, ఫుడ్ పాయిజన్స్ ఘటనలపై సమగ్ర నివేదిక రెండు వారాల్లోగా సబ్మిట్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed