- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దళితబంధు’ లబ్దిదారులకు బిగ్ షాక్.. స్కీమ్ నిధుల విడుదలలో సర్కార్ ప్లాన్ చేంజ్..?
దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షల సాయం అందిస్తామని సర్కారు ప్రకటించింది. కొన్ని చోట్ల ఈ పథకాన్ని అమలు చేసింది. తాజాగా ఈ స్కీమ్‌పై ఆంక్షలు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. ఇక నుంచి లబ్ధిదారులకు రూ.10 లక్షలను ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా మంజూరు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం గృహలక్ష్మి స్కీమ్‌లో లబ్ధిదారులకు ఒక్కో విడతలో రూ.లక్ష చొప్పును మొత్తం మూడు విడతల్లో రూ. 3 లక్షలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే తరహాలోనే దళిత బంధు స్కీమ్ నిధులను విడతల వారీగా రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు టాక్.
పొలిటికల్ మైలేజ్ కోసం..?
దళితబంధు నిధులను విడతల వారీగా విడుదల చేయడం ద్వారా నిధులు సర్దబాటు తేలికవడంతో పాటు ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు టాక్. ఒకేసారి రూ.10 లక్షల ఆర్థిక ప్రయోజనం అందిస్తే లబ్ధిదారుడు ఎన్నికల ముందు రూలింగ్ పార్టీ గుప్పిట్లో ఉంటారా? అనే అనుమానంతోనే ఇలా నిబంధనల్లో మార్పు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. షెడ్యూలు వచ్చేలోపు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ముందుగా రూ.2 లక్షలు అందించాలని, ఎన్నికల తర్వాత ప్రభుత్వ వెసులుబాటు మేరకు నిధుల మంజూరు ఉంటుందని ఓ సీనియర్ అధికారి వివరించారు.
ఫండ్స్ రిలీజ్ ఇలా..
‘ఓ లబ్ధిదారుడు డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే ముందుగా ఫామ్ ఏర్పాటుకు కావల్సిన షెడ్ నిర్మాణం సివిల్ వర్క్స్ కోసం తొలి విడతలో రూ. 2 లక్షలు, రెండో విడతలో ఇంటీరియల్, ఎలక్రికల్ వర్క్ కోసం, చివరి విడతలో గేదెల కొనుగోలు కోసం డబ్బులను విడుదల చేస్తారు.’ అని ఓ సీనియర్ ఆఫీసర్ వివరించారు. లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న యూనిట్ ప్రకారం మూడు నాలుగు విడతల్లో నిధుల విడుదల ఉంటుందని తెలిపారు.
కార్లు, ట్రాక్టర్ల, ఇతర వెహికల్స్ కొనుగోళ్లు కష్టమే..
దళితబంధు స్కీమ్ కింద కార్లు, ట్రాక్టర్ల కొనుగోళ్లను ఎంకరేజ్ చేయొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఆ యూనిట్స్ కొనుగోలుకు ఒకేసారి నిధుల అవసరమవుతుండటంతో పాటు పొలిటికల్ మైలేజ్ ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కీమ్ కింద పూర్తి స్థాయిలో నిధులు అందిన తర్వాత బెనిఫిషయర్స్ ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయకపోవచ్చనే అనుమానం బీఆర్ఎస్ లీడర్లను వెంటాడుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
ఇప్పటికే స్కీమ్ కింద కార్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులు వాటిని ఇతరులకు అమ్మిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎలాంటి వెహికల్స్‌ను ఎంకరేజ్ చేయొద్దని సీఎంవో నుంచి ఆఫీసర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. లబ్ధిదారులు యూనిట్ ఎన్నుకునే విషయంలో ఆఫీసర్లదే చాయిస్ ఉండనున్నట్టు తెలిసింది.
ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు రూ.2 లక్షలు
రాష్ట్రం ఈ స్కీం రెండో విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన ఎమ్మెల్యేలు.. లిస్టును సైతం రెడీగా పెట్టుకున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆ లిస్టును కలెక్టర్‌కు ఇవ్వడం, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు ఒక్కొక్కరికీ తొలి దఫా కింద రూ.2 లక్షల చెక్కులను అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆర్థిక వెసులుబాటు
2023–24 బడ్జెట్‌లో దళితబంధు కింద 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,29,800 మంది లబ్ధిదారుల కోసం సుమారు రూ.17,500 కోట్లును కేటాయించారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా అందరికీ ఒకేసారి రూ.10 లక్షలు ఇవ్వడం సాధ్యం కాదు. అందుకని దశలవారీగా నిధులను విడుదల చేయడం వల్ల లబ్ధిదారులను సంతోష పెట్టడంతో పాటు సర్కారుకు కాస్త ఆర్థిక వెసులు బాటు లభిస్తుందని అధికార వర్గాల టాక్.