షాదీ ముబారక్‌కు రూ.300 కోట్లు కేటాయింపు

by GSrikanth |
షాదీ ముబారక్‌కు రూ.300 కోట్లు కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: షాదీ ముబారక్ కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.300 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని సమాచార శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. షాదీ ముబారక్​స్కీమ్​ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,17,565 మందికి లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. పేద మైనార్టీ కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డ ఎదుగుదల, విద్యాభివృద్ధికి, బాల్య వివాహాలను అరికట్టడానికి షాదీ ముబారక్ పథకం దోహదపడుతోందని వెల్లడించారు. పేదింటి మైనార్టీ వర్గాల ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు గుండెల మీద భారం కావొద్దని భావించిన సీఎం కేసీఆర్ షాదీముబారక్ అనే విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఐఅండ్​పీఆర్ వెల్లడించింది. తొలుత ఈ పథకం కింద అల్ప సంఖ్యాక వర్గాల యువతుల వివాహానికి రూ. 51 వేల ఆర్థిక సాయాన్ని అందజేయగా.. అటు తరువాత 2017లో పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.75,116కు పెంచారు. ఆ తరువాత 19 మార్చి 2018 నుంచి రూ.1,00,116 లకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. అయితే, షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆడబిడ్డల్లో అధికశాతం మంది కేసీఆర్ కిట్లను అందుకుంటున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story