- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: తెలంగాణలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల వార్షిక ఆదాయం రూ. లక్షన్నరగానూ, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలుగా ఉండాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు ఉండాలని సూచించారు. పాత కార్డుల స్థానంలో కొత్తకార్డులు ఇవ్వాలని, అది కూడా స్వైపింగ్ మోడల్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తెల్లరేషన్ కార్డుల మంజూరుపై త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయాలని, ఈ ప్రక్రియలో రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అలాగే సక్సెనా కమిటీ సిఫారసులను పరిశీలించాలని, ఒక కుటుంబానికి ఒకే తెల్లరేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.