- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో అంత్యక్రియలు.. షాక్ ఇచ్చిన కాటికాపరి!
దిశ, గాంధారి: సాధారణంగా కాటికాపర్లు స్మశానంలో దహన క్రియల సందర్భంగా డబ్బులు డిమాండ్ చేయడం చూస్తుంటాం. కాని కామారెడ్డి జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కాటికాపరి రూ.5వేలు డబ్బులు డిమాండ్ చేస్తూ ఏకంగా చితిపై పడుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలో చోటు చేసుకుంది. దీంతో అంత్యక్రియలకు వచ్చిన వారంతా షాక్ అయ్యారు. నేరల్ తండాకు చెందిన దీప్‌చంద్ (46) కొద్దిరోజులుగా అరోగ్యం బాగా లేక గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స నిమిత్తం రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని మళ్లీ గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు. అర్థరాత్రి ఆపరేషన్ చేయకముందే హార్ట్ ఎటాక్ వచ్చి దీప్ చంద్ చనిపోయాడు. ఆదివారం నేరల్ తాండలో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే చితి వద్దకు చేరుకున్న కాటి కాపరి కాటిపై పడుకొని రూ.5వేలు ఇస్తేనే లేస్తానని పట్టుబట్టాడు. ఎంత బతిమిలాడిన లేవలేదు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు చివరకు రూ.2వేలు ఇచ్చి ఆయనను దింపి దహన సంస్కారాలు చేశారు. కుటుంబ పెద్ద చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న వారిని ఇలా వేధించడం సరికాదంటూ అక్కడున్న వారంతా చర్చించుకున్నారు.