- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు హైకోర్టు భవనానికి శంకుస్థాపన.. చీఫ్ గెస్ట్‌గా సుప్రీం సీజే
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హైకోర్టు నూతన భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హైకోర్టును నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. లోక్‌సభ ఎలక్షన్ కోడ్ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకావడం లేదు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా అటెండ్ అవుతున్నారు.
Advertisement
Next Story