- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. ఆ రోజే తొలి జాబితా..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోన్న బీజేపీ.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వస్తుండగా.. ఈ నెలలో ప్రధాని మోదీ, అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారానికి రానున్నారు. మరోవైపు అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్దమవుతోంది. కొన్ని నియోజకవర్గాలకు దాదాపు అభ్యర్థులు ఖరారు అవ్వగా.. జాబితా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
రేపు టీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశముంది. ఫస్ట్ లిస్ట్‌లో 30 నుంచి 40 అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుండగా.. అభ్యర్థుల ప్రకటనపై చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత అభ్యర్థుల ప్రకటనపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ భేటీలో అభ్యర్థుల ప్రకటనపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో బీసీలు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ మ్యానిఫెస్టో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటించనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీగా వరాలు ప్రకటించాయి. దీంతో బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వాలనే విషయంపై సమాలోచనలు చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలకు విభిన్నంగా కొత్త హామీలను పొందుపర్చనుంది. దీనిపై టీ బీజేపీ వర్గాలు కసరత్తులు చేస్తోన్నాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన మోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటనతో పాటు ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇది బీజేపీకి కాస్త కలిసి రానుంది.