ఫేక్ వీడియో ఇష్యూ.. కాంగ్రెస్ పార్టీపై ఫుల్ సీరియస్ అయిన కేంద్రమంత్రి అమిత్ షా

by Satheesh |   ( Updated:2024-05-05 14:13:07.0  )
ఫేక్ వీడియో ఇష్యూ.. కాంగ్రెస్ పార్టీపై ఫుల్ సీరియస్ అయిన కేంద్రమంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో జోరుగా సర్య్కూలేట్ అవుతోంది. ఈ వీడియోను అడ్వాంటేజ్‌గా మల్చుకున్న కాంగ్రెస్.. బీజేపీని టార్గెట్ చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తోందని ఎన్నికల వేళ కాషాయ పార్టీని ఇరుకున పెడుతోంది. ఈ క్రమంలో తన డీప్ ఫేక్ వీడియో ఇష్యూపై అమిత్ షా స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆదివారం బుధవారం కాగజ్ నగర్‌లో భారీ బహిరంగా నిర్వహించింది.

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని తెలిపారు. తన మాటలను వక్రీకరించి ఆ ఫేక్ వీడియోను సృష్టించారని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లు రద్దుకు బీజేపీ వెళ్లబోదని.. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీనే కాపాడుతుందని అన్నారు. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లకు మేం వ్యతిరేకమని.. ఎట్టి పరిస్థితుల్లో ఆ రిజర్వేషన్లు అమలు కాబోవని తేల్చి చెప్పారు. ఆ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని స్పష్టం చేశారు.



Read More...

తెలంగాణలో BJP గెలవబోయే MP సీట్లు ఎన్నో తేల్చి చెప్పిన అమిత్ షా

Advertisement

Next Story

Most Viewed