- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సబ్సిడీ ట్రాక్టర్లు ఎక్కడ.. గోప్యంగా లబ్దిదారుల వివరాలు!
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల అభివృద్ధే మా ధ్యేయం.. అన్నదాతలకు ఎలాంటి కష్టాలు రాకుండా 24 గంటలు రైతు శ్రేయస్సు కోసమే పని చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. రైతుల కోసం ఇప్పటి వరకు ఏం చేసిందో తెలుసుకునేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో రైతులు వ్యవసాయంలో ఇబ్బందులు పడకుండా, వారి అభివృద్ధి కోసం చేసిన పథకాలు, వ్యవసాయ పనిముట్లను, ట్రాక్టర్లను, ఎంతమందికి, ఎంత సబ్సిడీ కింద చెల్లించారో తెలపాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశామని సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.
రాష్ట్రంలోని రైతులు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 16,431 ట్రాక్టర్లను అందజేసినట్లు జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఎన్ని ట్రాక్టర్లను అందజేశారో వివరాలను ఇచ్చారు. అందుకు గాను రూ.554,64,03,888 నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ట్రాక్టర్లను అందించాలనే ప్రభుత్వం ఆలోచన బాగానే ఉంది. కానీ అసలు ట్రాక్టర్లు ఎంతమంది వ్యవసాయమే పరమావధిగా పనిచేసే అన్నదాతలకు ఇచ్చారో అంటే సమాధానం లేదు. రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు ఎక్కువ మంది నాయకుల బినామీలే తీసుకొని వాటిని దుర్వినియోగపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ట్రాక్టర్లు తీసుకున్న రైతుల పేర్లు అడిగామని, పేర్ల జాబితా రాగానే జిల్లాల వారీగా సర్వే చేసి ట్రాక్టర్లు తీసుకున్న వారిలో ఎంత మంది రైతులో, ఎంతమంది బినామీలో బయటపెడతామని రాజేంద్ర తెలిపారు.
ఏ జిల్లాకు ఎన్ని?
ఆదిలాబాద్లో 408, కొత్తగూడెంలో 174, హన్మకొండలో 407, జగిత్యాలలో 534, జనగామలో 465, భూపాలపల్లిలో 406, గద్వాలలో 198, కామారెడ్డిలో 198, కామారెడ్డిలో 803, కరీంనగర్ లో 1146, ఖమ్మంలో 1046, ఆసిఫాబాద్ లో 187, మహబూబాబాద్ లో 519, మహబూబ్ నగర్ లో 698, మంచిర్యాలలో 224, మెదక్ లో 323, మేడ్చల్ లో 41, నాగర్ కర్నూలులో 403, నల్లగొండలో 927, నిర్మల్ లో 478, నిజామాబాద్ లో 1761, పెద్దపల్లిలో 312, సిరిసిల్లలో 823, రంగారెడ్డిలో 361, సంగారెడ్డిలో 697, సిద్దిపేటలో 697, సూర్యాపేటలో 501, వికారాబాద్ లో 369, వనపర్తిలో 274, వరంగల్ లో 274, యాదాద్రి భువనగిరిలో 926 వంతున మొత్తం 16,431 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. దీనికి గాను రూ.554.64 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ యంత్ర లక్ష్మి పథకం కింద వ్యవసాయ యాంత్రీకరణ నడుస్తుంది. ఇందులో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడానికి 50 శాతం సబ్సిడీతో పాటు 50 శాతం రీమింగ్ కోసం రుణాన్ని అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్ ధరలో 50 శాతం అందిస్తుంది. మిగిలిన డబ్బు కోసం రైతులు జాతీయ బ్యాంకుల నుంచి రుణం పొందొచ్చు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీని అందిస్తున్నది.
ఎక్కడున్నాయో మరి!
రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అనుచరులే ఈ సబ్సిడీ ట్రాక్టర్లు తీసుకున్నారని సమాచారం. అందుకే ఈ 16,431 ట్రాక్టర్లలో రైతుల దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇతరులకు అమ్మినవి ఎన్ని? అసలైన లబ్దిదారులకు చేరినవి ఎన్ని? అనే వివరాలను ఆరా తీస్తామని యూత్ ఫర్ యాంట్రీ కరప్షన్ పేర్కొన్నది. ఐతే కొందరు లబ్దిదారులు ట్రాక్టర్ షోరూం యజమానులకే అమ్మేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. వాళ్లు కస్టమర్లకు తిరిగి అమ్మేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.