- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డెడ్‌లైన్ ముగిసిన వెనక్కి తగ్గని జేపీఎస్‌లు.. సర్కార్ నెక్ట్స్ యాక్షన్‌పై తీవ్ర ఉత్కంఠ!
దిశ, వెబ్‌డెస్క్: సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసినప్పటకీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెనక్కి తగ్గలేదు. ఈ రోజు సాయంత్రం ఐదు దాటిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పంచాయతీ కార్యదర్శులు సమ్మె కొనసాగిస్తుండటంతో ప్రభుత్వం నెక్ట్స్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, తమను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు.
ఈ సమ్మెపై సీరియస్ అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సమ్మెను విరమించి మే 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. ఈ సమయం కల్లా రిపోర్ట్ చేయని వారిని విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం మే 8వ తేదీన ఆదేశాలు సైతం జారీ చేసింది. ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెనక్కి తగ్గకపోవడం ఆసక్తికరగా మారింది. ఇక, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మద్దతు తెలిపాయి.