Vice President: హైదరాబాద్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌ దంపతులు

by Mahesh |   ( Updated:2024-12-25 10:28:11.0  )
Vice President: హైదరాబాద్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌ దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్(Vice President Dhankad) తెలంగాణ పర్యటన(Tour of Telangana)లో భాగంగా.. ఈ రోజు మధ్యాహ్నం తన భార్యతో కలిసి హైదరాబాద్(Hydrabad) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ఘనస్వాగతం(Welcomed) పలికారు. కాగా వైస్ ప్రెసిడెంట్ రాకకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ముందస్తుగానే సమాచారం అందడంతో.. రెండు రోజుల పాటు బ్లూ బుక్ ప్రకారం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎస్. ఆమె ఆదేశాల మేరకు రంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్‌లు, ఉప రాష్ట్రపతి కార్యాలయంతో, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వైస్ ప్రెసిడెంట్ పర్యటనలో భాగంగా జగదీప్ ధన్‌కడ్‌, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మలు తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖి లో పాల్గొంటారు.

Advertisement

Next Story

Most Viewed