- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మినిమమ్ టైం స్కేల్, ఉద్యోగాలను క్రమబద్దీకరించాలి.. మంత్రికి కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకుల తమకు మినిమమ్ టైం స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ బుధవారం విద్య శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. సమగ్ర శిక్షా, కెజిబివి, యుఆర్ఎస్లను విద్యాశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొనడం జరిగిందని తెలిపారు.
గ్రూప్ ఇన్సురెన్స్ సౌకర్యం, నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలి (హెల్త్ కార్డుల సౌకర్యం) కల్పించాలని మంత్రిని కోరామని తెలిపారు. విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వేయిటేజ్ కల్పించాలని, మరణించిన, గాయపడిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మంత్రిని కోరారుతమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని విద్యా శాఖ మంత్రి సబితఇంద్ర రెడ్డి హామీ ఇచ్చారని అయన పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా జెఏసి అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సందీప్, సురేష్, రమేష్, మణికొండ కిరణ్ కుమార్, వరదా చార్యులు పాల్గొన్నారు.