కొత్త ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం.. వారిని ఎంకరేజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!

by GSrikanth |
కొత్త ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం.. వారిని ఎంకరేజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: విధాన నిర్ణయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నది. పాలసీ తయారులో ఒంటెత్తు పోకడలు లేకుండా పలు వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. అందులో ప్రధానంగా బ్యూరోక్రట్స్ సూచనలు, సలహాలు తీసుకుంటున్నది. దీనితో శాఖల రివ్యూల సమయంలో ఐఏఎస్‌లు తమ ఒపినియన్స్‌ను స్వేచ్ఛగా చెబుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం ఏం చేయాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఆఫీసర్ల సూచనలు, సలహాలకు ప్రయారిటీ

కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యూరోక్రట్స్‌కు ప్రాధాన్యత పెరిగినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది. ఇంతకాలం లూప్ లైన్‌లో ఉన్న సమర్థులైన అధికారులను గుర్తించి, వారికి కీలకమైన స్థానాల్లో పోస్టింగ్ ఇస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే గత సర్కారు కన్నా భిన్నంగా ప్రస్తుత సర్కారులో అధికారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రివ్యూలు, మీటింగ్స్ జరిగే సమయంలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నట్టు టాక్ ఉంది. దీనితో ఆఫీసర్లు సైతం ఉత్సాహంగా తమ ఒపినియన్స్ చెబుతున్నట్టు తెలుస్తున్నది. అలాగే గౌరవ, మర్యాదాలు ఇస్తున్నారనే టాక్ ఐఏఎస్ వర్గాల్లో ఉంది.

నాడు వినేందుకు అనాసక్తి?

కేసీఆర్ హయాంలో జరిగే రివ్యూలు, మీటింగ్స్‌ను బ్యూరోక్రట్స్ గుర్తుకు తెచ్చుకుని కలత చెందుతున్నారు. అప్పట్లో సీఎం వద్ద జరిగే సమీక్షలు వన్ సైడ్ జరిగేవని అధికార వర్గాల్లో టాక్ ఉంది. ఏ ఆఫీసర్ అయినా ధైర్యం చేసి చెప్పేందుకు ప్రయత్నిస్తే, సెటైర్లు వేసి అవమానపరిచేవారని, దీనితో ఎవరూ చెప్పేందుకు సాహసం చేసేవారు కాదని అంటున్నారు. “ కేసీఆర్ చెప్పింది మాత్రమే వినే కల్చర్ ఉండేది. ఆయన ఎస్ అంటే ఎస్.. నో అంటే నో.. అనే తీరుగా అధికారులు తయారు అయ్యారు.’’ అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు. కొందరు ఆఫీసర్లను దూషించిన సంఘటనలు అనేకం ఉన్నట్టు గుర్తుకు తెచ్చుకుని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed