- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలి'
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను హైకోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని ఎన్ఎస్ఎస్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. సాయిబాబాను 2014లో అరెస్టు చేసే నాటికి నేర చరిత్ర లేదన్నారు. శాశ్వత వికలాంగుడైన సాయిబాబా గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఇటీవల బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసిందని, అయితే ఒక్కరోజు వ్యవధిలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసిందన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామికవాదుల మెదడుపై, ప్రత్యామ్నాయ సిద్ధాంత మేధావులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఉపా చట్టం కింద జైళ్ళలో నిర్బందిస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరించి సామాజిక న్యాయం అందించాలని కోరారు. జాతీయ దర్యాప్తు సంస్థను రద్దు చేయాలని, ఉపా చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను నిరసిస్తూ ఆందోళన చేసిన 40 మంది ప్రొఫెసర్లపై విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ నారాయణ రావు, జి జబాలి, విష్ణువర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు.