చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలి.. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

by Ramesh Goud |   ( Updated:2025-03-16 13:12:54.0  )
చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలి.. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) పై చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని (Chief Minister) ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో కేటీఆర్.. ఈ పిచ్చి కుక్క (Mad Dog) మర్యాదకు (decency) ఉండే అన్ని పరిమితులను (Limits) దాటి ప్రవర్తిస్తుందని అన్నారు. అలాగే ఆయనను వీలైనంత త్వరగా మానసిక ఆరోగ్య కేంద్రానికి (mental health facility) తీసుకెళ్లాలని అతని కుటుంబ సభ్యులను అభ్యర్థిస్తున్నాను అంటూ.. లేకుంటే నిరుత్సాహ స్థితిలో (frustrated state) చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరినీ కరుస్తాడని (biting) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేగాక చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని (Get well soon) కోరుకుంటున్నానని బీఆర్ఎస్ నేత రాసుకొచ్చారు. కాగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల అనంతరం రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాకు స్ట్రేచర్ ఉందని వీర్రవీగారని, ఇకనైనా ఆ వైకరి మార్చుకోవాలని అన్నారు. అంతేగాక స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచ్చర్ మీదికి పంపించారని, ఇలాగే ఉంటే రేపు మార్చురీకి పోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోవాలని కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

Next Story