ఫ్రీ బస్సు పథకం భారం మా రైతుల మీదనే పడుతుంది! ఓ రైతు కామెంట్

by Ramesh N |   ( Updated:2024-04-28 12:59:19.0  )
ఫ్రీ బస్సు పథకం భారం మా రైతుల మీదనే పడుతుంది! ఓ రైతు కామెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ ఇస్తున్నారు. పథకం వినియోగించుకోని రోజుకు 30 లక్షలకు పైగా బస్సుల్లో మహిళలు ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వారి టికెట్ ఖర్చు ప్రభుత్వమే భరించనున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే తాజాగా నాగర్‌కర్నూల్‌కు చెందని ఓ రైతు మీడియాతో మాట్లాడారు. ఫ్రీ బస్సు పథకం భారం మా రైతుల మీదనే పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బస్సులు మహిళలకు ఫ్రీ అన్నప్పుడు దానికి చెల్లించాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు పథకం భారమంతా రైతులపైనే పడుతుందన్నారు. రైతు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రైతు కామెంట్స్ చర్చానీయాంశంగా మారింది.

నాగ‌ర్‌క‌ర్నూల్‌‌కు చెందిన మరో రైతు మాట్లాడుతూ.. ఉన్న వ‌డ్ల‌ను కొనేందుకు దిక్కు లేదన్నారు. వ‌డ్ల‌న్నీ కుప్ప పోస్తే అవి వ‌ర్షానికి త‌డిసిపోయాయని చెప్పారు. వాటిని కొనేటోడే లేడని, బోన‌స్ ఎక్క‌డుంది? ఎంత ఎండిపోతే అంత న‌య‌మ‌నిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ‌మాఫీ విషయంలో రేవంత్‌కు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలన్నారు. రైతుల‌ను రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు.

Advertisement

Next Story