- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Anger : ఒక్క నిమిషం కంట్రోల్ చేసుకోలేకపోతే.. రెండు మూడు గంటలు అనుభవిచాల్సిందే!!

దిశ, ఫీచర్స్ : తన కోపమె తనకు శత్రువు అంటారు పెద్దలు. పరిశోధనలు సైతం ఇది నిజమేనంటున్నాయి. మీరు ఒక్క నిమిషం కోపంతో ఉండటం, కోపాన్ని నియంత్రించు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, ఆ తర్వాత మిమ్మల్ని రెండు మూడు గంటల వరకు శక్తి హీనులుగా మారుస్తుందని పేర్కొంటున్నాయి. అంతేకాదు ఆ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. కార్టిసాల్ అనేహార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మనిషిలో రోగనిరోధక పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలా జరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పదే పదే కోపం రావడం వల్ల దీర్ఘకాలిక ఒత్తిడి డెవలప్ అవుతుంది. దీంతో శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా పెరగడం మీలో అనారోగ్యాలతో పోరాడే శారీరక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రక్షిత రోగ నిరోధక కణాల ఉత్పత్తిని నెమ్మదిస్తుంది. శరీరంలో దాదాపు అన్ని ఆరోగ్య ప్రక్రియలకు అంతరాయం కలుగుతుంది. అయితే ప్రశాంతత, నవ్వు వంటి సానుకూల భావోద్వేగాలు మాత్రం రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, మెదడు చురగ్గా ఉండటానికి దోహదం చేస్తాయి. అంతేకాదు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్ చేయడానికి కోపం, ఒత్తిడి వంటి సందర్భాల్లో భావోద్వేగ నియంత్రణ (emotional control)కు నవ్వు, ప్రశాంతత చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. కోపాన్ని కంట్రోల్ చేయడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి.