- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లా అధ్యక్షుల పనితీరు భేష్.. పార్టీ హైకమాండ్ ప్రశంసలు
దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లా అధ్యక్షుల పనితీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రశంసలు కురిపించింది. వారి పనితీరు భేష్‌గా ఉందని హైకమాండ్ కితాబిచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఢిల్లీకి వెళ్లిన జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశంలో బండి జాతీయ నాయకత్వానికి దీనిపై నివేదించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగులను సక్సెస్ ఫుల్‌గా నిర్వహించడంపై జాతీయ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పుడున్న టీమ్ తోనే ఎన్నికలకు వెళ్లాలని హైకమాండ్ క్లారిటీ ఇచ్చనట్లుగా తెలుస్తోంది. దీంతో జిల్లా అధ్యక్షుల మార్పు అంటూ వస్తున్న ప్రచారానికి తెరపడినట్లయింది.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడింది. దీన్ని దెబ్బకొట్టేందుకు ఇతర పార్టీలు కుయక్తులు పన్నాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. జిల్లా అధ్యక్షుల మార్పు ఉండబోదని జాతీయ నాయకత్వం క్లారిటీ ఇచ్చినా పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశ్యంతో ఇతర పార్టీల నేతలు మీడియా చానళ్లకు లీకులిస్తున్నట్లుగా గుర్తించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. స్ట్రాంగ్ గా ఉన్న పార్టీని బలహీనపరచాలని చూస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని కమలనాథులు చెబుతున్నారు. జిల్లా అధ్యక్షుల మార్పు తప్పుడు ప్రచారమని పార్టీ శ్రేణులు ఖండించాయి. ఎన్నికల ఏడాదిలో జిల్లాల అధ్యక్షుల మార్పు ఊహాజనితమని, తప్పుడు సమాచారాన్ని మీడియాకు లీకులుగా ఇస్తున్నారని రాష్ట్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది.
వాస్తవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను సైతం మారుస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ దీనిపై ఇప్పటికే జాతీయ నేతలు పలువురు క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ ఉండబోదని, ఆయన ఆధ్వర్యంలనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు స్పష్టంచేశారు. ఎన్నికలకు కేవలం కొన్ని నెలల సమయమున్న తరుణంలో మార్పులు చేస్తే పార్టీకి నష్టమని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ తరుణంలో మార్పు అంటూ వస్తున్న దుష్ప్రచారం కావాలని బండి సంజయ్ ను ఇరుకున పెట్టే వ్యూహంగా పలువురు నేతలు వెల్లడించారు. సంబంధంలేని పేర్లను జోడించి పత్రికలకు లీక్ ఇవ్వడంపై బండి సంజయ్ సైతం అసహనం వ్యక్తంచేసినట్లు టాక్. పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి లీకులు ఇస్తున్న వారిని ఉపేక్షించకూడదని బండి సంజయ్ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇదిలాఉండగా పనితీరు ఏమాత్రం సరిగ్గా లేని నలుగురు జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశాలున్నట్లుగా పలువురు కమలనాథులు చెబుతున్నారు.
తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు: గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జిల్లాల అధ్యక్షులను మార్చుతున్నారనే ప్రచారం అంతా అబద్ధం. తప్పుడు ప్రచారం చేసే వారిపై సీరియస్ చర్యలు తీసుకుంటాం. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా, నేతల్లో గందరగోళం స్రుష్టించేలా మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేతలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుల మార్పుపై చర్చే లేదు. పార్టీ ఎదుగదలను చూసి ఓర్వలేని శక్తులే ఇట్లాంటి అసత్యపు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఉపేక్షించేది లేదు.