- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌ల పొత్తు ఖరారు.. లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు..!
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా స్టేట్ పాలిటిక్స్‌లో నానుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల పొత్తుల వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారు అయ్యింది. పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్ట్‌లకు మొత్తం 4 సీట్లు ఇచ్చేందుకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు సీట్లను కేటాయించింది. వైరా, మిర్యాలగూడ అసెంబ్లీ సీట్లను సీపీఎంకు కేటాయించింది.
కొత్తగూడెం, చెన్నూరు సెగ్మెంట్లను సీపీఐ పార్టీలకు ఖరారు చేసింది. కాగా, కమ్యూనిస్టులు కోరిన మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ఇక, కాంగ్రెస్ కేటాయించిన నాలుగు స్థానాల్లో సీపీఎం, సీపీఐ నుండి ఎవరు బరిలోకి దిగుతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. లెఫ్ట్ పార్టీలతో పొత్తు, సీట్లు ఖరారు కావడంతో త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.