నగరంలో థాంక్యూ మోడీ జీ ఫ్లెక్సీలు.. బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-13 14:14:42.0  )
నగరంలో థాంక్యూ మోడీ జీ ఫ్లెక్సీలు.. బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలుపుతూ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. సామాన్యులకు న్యాయం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందంటూ భారీ కటౌట్స్, హోర్డింగులు వెలిసాయి. బడ్జెట్‌లో వివిధ కేటాయింపులపై ధన్యవాదాలు తెలుపుతూ వీటిని ఏర్పాటు చేశారు. తెలంగాణ మధ్య తరగతి ప్రజలు, డబుల్ బెడ్రూం బాధితుల సంఘం, తెలంగాణ నర్సింగ్ విద్యార్థులు, గిరిజన విద్యార్థి సమాఖ్య పేరిట ఈ హోర్డింగ్స్ ఏర్పాటయ్యాయి. 'దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు'అంటూ తెలంగాణ నర్సింగ్ విద్యార్థుల పేరిట హోర్డింగ్ కనిపించింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రూ. 79 వేల కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్ రూం బాధితుల సంఘం పేరిట మరో హోర్డింగ్ ఏర్పాటైంది. వచ్చే మూడేళ్లలో దేశంలోని 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం 38,800 మంది ఉపాధ్యాయులు, సహామయక సిబ్బంది నియామకం చేపడుతున్న నరేంద్రమోడీకి ధన్యవాదాలు అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ శ్రేణులు వీటిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed