బ్రేకింగ్: థాయ్ లాండ్‌లో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కు బిగ్ రిలీఫ్

by Satheesh |   ( Updated:2023-12-15 16:35:26.0  )
బ్రేకింగ్: థాయ్ లాండ్‌లో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: థాయ్ లాండ్ దేశంలోని పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ అక్కడి పోలీసులకు చిక్కిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కు భారీ ఊరట లభించింది. దేశంలో అక్రమంగా గ్యాంబ్లింగ్ నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో థాయ్ పోలీసులు చికోటీ ప్రవీణ్‌ను నిన్న ( సోమవారం) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇవాళ చీకోటి ప్రవీణ్‌కు అక్కడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన థాయ్ కోర్టు.. 4500 బాట్స్ జరిమానా విధించింది. కోర్టు విధించిన జరిమానా చెల్లించేంత వరకు చీకోటి ప్రవీణ్ పాస్ పోర్టును అధికారుల వద్దే పెట్టుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌తో పాటు అరెస్ట్ అయిన వారిలో మరో 83 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక, కోర్టు విధించిన ఫైన్ చెల్లించడంతో చీకోటీ ప్రవీణ్ పాస్ట్ పోర్టును అధికారులు అతడికి ఇచ్చేసినట్లు సమాచారం. దీంతో చీకోటీ ప్రవీణ్‌, బెయిల్ మంజూరు అతడి గ్యాంగ్ ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed