TGSP constables : అరెస్టులతో టీజీఎస్పీ కానిస్టేబుళ్ల కట్టడి

by Y. Venkata Narasimha Reddy |
TGSP constables : అరెస్టులతో టీజీఎస్పీ కానిస్టేబుళ్ల కట్టడి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రమంతా ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు(TGSP constables) సెక్రటేరియట్‌ (Secretariat) ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారు సెక్రటేరియట్‌ వైపు రాకుండా ఎక్కడివారిని అక్కడే అరెస్టు(arresting everywhere) చేస్తున్నారు. ముందుగా బెటాలియన్లు నుంచి హైదరాబాద్ రాకుండా వారిని అడ్డుకున్నారు. హైదరాబాద్ వచ్చిన వారిని నగర శివార్లలో, సచివాలయంకు వెళ్లే దారుల్లో అరెస్టు చేస్తున్నారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయం ముట్టడికి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు బయలుదేరిన బెటాలియన్ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వంపై బెటాలియన్ల కానిస్టేబుళ్లు మండిపడ్డారు. కష్ట పడి ఉద్యోగం తెచ్చుకున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని, 10 మందిని ఉద్యోగం నుండి తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏక్ పోలీస్ చేస్తానని చెప్పు ఇప్పుడు మమ్మల్ని కనీసం కలిసేందుకు కూడా అనుమతించడం లేదని విమర్శి్ంచారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ మమ్మల్ని ఒకసారి పిలిచి మాతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story