- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGPSC Group-2: మరికొద్దిసేపట్లో గ్రూప్-2 పరీక్ష.. పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సినవి ఇవే!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు ఇవాళ, రేపు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి తమ వెంట బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పాటు ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో ఫొటో సరిగా ప్రింట్ కాని పక్షంలో లెటెస్ట్‌గా దిగిన మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను తీసుకెళ్లాలి.
ఇక అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందు అనుమతించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుతించబోరు. అదేవిధంగా పరీక్ష రాసే అభ్యర్థులు చేతులకు గోరింటాకు, తాత్కాలికమైన టాటూలు వంటివి ఉంటే లోనికి రానివ్వరు. పరీక్షా కేంద్రంలోకి పెన్ డ్రైవ్స్, మొబైల్స్, బ్లూ టూత్ నిషేధం. మహిళా అభ్యర్థులు గాజులు, చైన్లు, రింగులు, రబ్బరు బ్యాండ్, హ్యాండ్ బ్యాగ్, వాచ్‌తో పెట్టుకుని వస్తే పరీక్షకు అనుమతించరు. గ్రూప్-2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్ష కొనసాగనుంది. పేపర్ 3, 4 రేపు నిర్వహిస్తారు. పరీక్షా సమయంలో ఎలాంటి ఇబ్బదులు తలెత్తినా, అదేవిధంగా హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో సందేహాలు ఉన్నా 040-23542185 లేదా 040-23542187 హెల్ప్‌లైన్ నెంబర్లకు సంప్రదించాలని, లేదా [email protected] కు మెయిల్ చేయవచ్చని అధికారులు సూచించారు.