TG TET: కాసేపట్లో టెట్ పరీక్షలు ప్రారంభం.. పరీక్షకు హాజరుకానున్న 2,75,753 మంది అభ్యర్థులు

by Shiva |   ( Updated:2025-01-02 03:07:41.0  )
TG TET: కాసేపట్లో టెట్ పరీక్షలు ప్రారంభం.. పరీక్షకు హాజరుకానున్న 2,75,753 మంది అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కాబుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఆన్‌లైన్‌ (Online) విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. టెట్ (TET) పరీక్షకు మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో పేపర్‌-1కు 94,327 మంది, పేపర్‌-2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో అధికారులు పరీక్షలను నిర్వహించనున్నారు.

ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ వారీగా పరీక్షలు కొనసాగనున్నాయి. ఉద‌యం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే అభ్యర్థుల‌ను ఉద‌యం 7.30 నుంచి ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తిస్తారు. మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే వారిని మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి లోనికి అనుమ‌తిస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ మొదలయ్యే 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రం గేట్లను మూసివేయనున్నారు.

Advertisement

Next Story