- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టు(High Court)కు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ రేణుకా యారా, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ ఇ.తిరుమలదేవి, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావుతో హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఇంతకుముందు రేణుక యారా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, ఇ.తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా, బి.ఆర్.మధుసూదన్‌రావు హైకోర్టు రిజిస్ట్రార్(పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులకు గానూ.. తాజా నియామకాలతో కలిపి ప్రస్తుత సంఖ్య 30కి చేరింది.
Next Story