TG High Court: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు బిగ్ రిలీఫ్.. జిల్లా కోర్టు నోటీసులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

by Shiva |   ( Updated:2024-12-24 06:36:37.0  )
TG High Court: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు బిగ్ రిలీఫ్.. జిల్లా కోర్టు నోటీసులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)‌లకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (High Court)లో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు (Jayashankar Bhupalapally District Court) ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగా లేవంటూ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఫిర్యాదుదారుడు నాగవెల్లి లింగమూర్తికి నోటీసులు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టగా.. తాజాగా హైకోర్టు ఆ నోటీసులను సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 7కు వాయిదా వేసింది.

కాగా, మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగడానికి ప్రధాన కారణం కేసీఆర్‌ (KCR), హరీష్‌ రావు (Harish Rao), తదితరులు కారణమంటూ నాగవెల్లి రాజలింగమూర్తి (Nagavelli Rajalinga Murthy) అనే వ్యక్తి భూపాలపల్లి మేజిస్ట్రేట్‌ కోర్టు (Bhupalapally Magistrate Court)లో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ అంశం తమ పరిధిలోకి రాదని మేజిస్ట్రేట్‌ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేవేసింది. దీంతో పిటిషన్ రాజలింగమూర్తి జిల్లా కోర్టును ఆశ్రయిస్తూ.. రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్‌ (KCR), హరీశ్‌ రావు (Harish Rao) తదితరులకు నోటీసులు జారీ చేసింది. దీంతో వారు రివిజన్‌ పిటిషన్‌ (Revision Petition)ను స్వీకరించే అధికారం భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదంటూ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను కొట్టివేస్తున్నట్లు తీర్పును వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed