- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly : అప్పుడు విమర్శించి రూ.10వేల కోట్ల భూములు అమ్ముతారా.. హరీష్ రావు ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: శాసనసభలో 2024-25 వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ వాడీవేడిగా కొనసాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రూ.35వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని తెలిపారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టి, శ్రీధర్ బాబు విమర్శించారని.. ఇప్పుడు రూ.10 వేల కోట్ల భూములు అమ్మి నిధులు సమీకరిస్తామని చెప్పారని తెలిపారు. రూ.24వేల కోట్లు అదనంగా ఎలా తీసుకువస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలన్నారు.
సాధ్యం కానీ తరహాలో ఆదాయం ఎక్కువ చూపారన్నారు. తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపారని ఆక్షేపించారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారని.. కానీ బడ్జెట్‌లో రూ.26వేల కోట్లు మాత్రమే వస్తోందన్నారు. రుణమాఫీ ఇవ్వడం ఆలస్యం అయిందని రైతుల నుంచి బ్యాంకర్లు వడ్డీ వసూలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం రుణమాఫీ ఆలస్యం చేసి రైతులపై భారాన్ని మోపుతుందని సీరియస్ అయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తాము కొనసాగించామని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్‌లాంటి పథకాల పేర్లు మార్చి పంపిణీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.