- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly : పోలీసుల తీరుపై అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: పోలీసులు తీరుపై అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సీరియస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన అన్నారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. కొత్త న్యాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ కొట్టుమిట్టాడుతోందని.. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టి ఆయా అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మిడ్ డే మీల్స్ కార్మికులు ధర్నా చేసేందుకు అనుమతి కోరితే పోలీసులు ‘నో’ చెప్పారని పోలీస్ శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని సీరియస్ అయ్యారు. ఉపా లాంటి చట్టాలను కేంద్రం ఇష్టారీతిన అమలు చేస్తోందని రాష్ట్ర సర్కారు ఆ చట్టాలను అమలు చేయకుండా చూడాలని కోరారు.