- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్! ఈడీ ఆఫీస్ వద్ద కేంద్ర బలగాల మోహరింపు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈఢీ ఆఫీసు వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. కార్యకర్తలు ఆందోళనలు చేస్తే నియంత్రించేందుకు పోలీసులను నియమించారు. ఈడీ ఆఫీస్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. రెండోసారి విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా తాజా ఘటనల నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది.
అయితే కాసేపట్లో మీడియా ముందుకు కవిత రానున్నారు. కవితతోనే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మరొకొత మంది ఎంపీలు, మహిళా మంత్రులు ఉన్నారు. అయితే నిన్న సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో కవిత పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈడీ బెదిరిస్తోదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తులో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, ఈ కేసులో సాక్షిగా ఉన్న చందన్ రెడ్డిని క్రూరంగా కొట్టారన్నారు. చందన్ రెడ్డి వినికిడి శక్తి కోల్పోయారని కవిత పేర్కొన్నారు.