HYD: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. గేట్లు తోసుకొని చొచ్చుకెళ్లేందుకు విద్యార్థుల యత్నం

by GSrikanth |
HYD: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. గేట్లు తోసుకొని చొచ్చుకెళ్లేందుకు విద్యార్థుల యత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇండియర్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచు వేళ టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని శనివారం ఆందోళనకు దిగారు. ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పీవైఎల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హెచ్‌సీఏ(HCA) ప్రెసిడెంట్‌కు వినతిపత్రం ఇవ్వడానికి స్టేడియం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సిబ్బంది లోనికి అనుమతి అనుమతి నిరాకరించారు. దీంతో గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ జరుగనుంది.

Advertisement

Next Story