- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telugu Students in USA: అమెరికాలో చదివే తెలుగు విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్..!
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో చదువుతున్న (Telugu Students in USA) తెలుగు విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం మొదలైంది. అమెరికా యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు హెచ్చరిక చేశాయి. సెలవుల కోసం స్వదేశానికి వెళ్లినవారు వెంటనే వచ్చేయాలని విదేశి విద్యార్థులకు మెసేజ్‌లు పంపాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే లోపు విద్యార్థులు తిరిగి రావాలని ఆదేశించాయి. ట్రంప్ ప్రమాణస్వీకారంలోపే అమెరికా వెళ్లేందుకు విద్యార్థులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా రిస్క్ తీసుకోవడానికి తెలుగు స్టూడెంట్స్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో ఇండియా, అమెరికా ఫ్లైట్స్ దాదాపు ఫుల్ అయ్యాయి. అయితే, గత 2016 లో చాలా మంది విదేశీ విద్యార్థులను ట్రంప్ వెనక్కి పంపించారు. దీంతో తెలుగు విద్యార్థుల్లో హడావుడి మొదలైంది.
కాగా, 47 వ (United States America) అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటి రోజే కీలక నిర్ణయాలు తీసుకోకున్నట్లు టాక్ నడుస్తోంది. ఆర్థికం, ఇమ్మిగ్రేషన్ లాంటి అంశాలపై ఆయన సంతకం చేసే చాన్స్ ఉంది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కొత్త విదానాలు తీసుకువస్తే ట్రావెల్, వీసా ప్రాసెసింగ్‌లో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులు, స్టాఫ్‌కు అమెరికా వర్సిటీలు ఆదేశాలిచ్చాయి. అమెరికాలో 54 శాతం భారత్, చైనాకు చెందిన విద్యార్థులే ఎక్కువ ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. తాజాగా నివేదికల ప్రకారం అగ్రస్థానంలో భారత విద్యార్థులు ఉన్నట్లు యూస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ డోర్స్ 2024 నివేదిక తెలిపింది.