బలవంతంగా కారులోకి నెట్టడంతో నొప్పి తట్టుకోలేక విలవిలలాడిన ఎమ్మెల్యే.. స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

by Mahesh |
బలవంతంగా కారులోకి నెట్టడంతో నొప్పి తట్టుకోలేక విలవిలలాడిన ఎమ్మెల్యే.. స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: హుజురాబాద్‌లో దళితబంధు(dalita bandu) డబ్బులు విడుదల చేయాలని ధర్నా బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) తలపెట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. శనివారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్(BRS) నేతలతో ధర్నా(protest)కు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఆయనను అడ్డుకున్నారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ నేతలు హుజురాబాద్(Huzurabad) చౌరస్తా కు చేరుకోవడంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎన్ నేతల మధ్య తోపులాట జరిగింది.

అయినప్పటికీ పోలీసులు కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) ని బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. కాగా పోలీసులు ఆయనను బలవంతంగా కారులోకి కుక్కడంతో.. ఊపిరి ఆడకపోవడం తో ఆయన కారులో.. విలవిలలాడి నట్లు ఓ వీడియోలో కనిపించింది. కాగా ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన స్పృహ కోల్పోవడం తో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ పరిస్థితులతో హుజురాబాద్ పట్టణంలో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎన్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed