- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమోషనల్
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా పర్యాటనలో ఉన్న బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అనేక మంది తెలుగు విద్యార్థులు కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి (ఏఓవీఎన్) పథకం కింద విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లిన వాళ్లు తనను కలిశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసాన్ని వాళ్లు చెబుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆవేదన చెందారు. దాదాపు 500 మంది విద్యార్థులు స్కాలర్షిప్‌లు రాక అప్పులు చేసి, ఇక్కడ ఇళ్లల్లో పనిచేస్తూ పొట్టనింపుకుంటూ, చదువుకున్నారని వెల్లడించారు.
‘మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిస్తే తన చేతిలో ఏమీ లేదు అని చేతులు ఎత్తేసిండని, పోయి సీఎంనే అడగండి అని స్టుడెంట్స్‌తో అన్నాడంట..! (మరి నిరసనగా రాజీనామా చెయ్యండి కదా!) ఇంత చేతకాని సర్కారును మనం ఎందుకు భరించాలి?’ అని ప్రశ్నించారు. వారం రోజుల్లో ఈ విద్యార్థుల బకాయిలు క్లియర్ చేయకపోతే సంక్షేమ భవన్‌ను, ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తర్వాత మీ ఫాంహౌసులను ఆక్రమించి వాటిని బహిరంగ వేలం వేసి విద్యార్థుల చదువును జీవితాలను కాపాడుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను మా పేదల బస్తీలలో తిరగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలారా, ఈ రాబందులపై మహా పోరాటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.