ఎక్కడి నుంచి సిద్దమో చెప్పు.. కేటీఆర్ కు మంత్రి పొన్నం సవాల్

by Ramesh Goud |   ( Updated:2024-03-01 17:05:58.0  )
ఎక్కడి నుంచి సిద్దమో చెప్పు.. కేటీఆర్ కు మంత్రి పొన్నం సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలుచుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసరగా, దానికి కేటీఆర్ స్పందిస్తూ.. మల్కాజ్ గిరి పార్లమెంట్ పోటీ చేయడానికి సిద్దమా అని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్ మంత్రులు ఒక్కోక్కరుగా స్పందిస్తూ.. కేటీఆర్ కు కౌంటర్ సవాళ్లు విసురుతున్నారు.

ఈ నేపధ్యంలోనే తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ పై సవాలు చేశారు. మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనికి వస్తుందని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో మీరు ఎక్కడైనా పోటీ కి సిద్ధమా..? మేము రాజీనామా చేస్తాం అని సవాల్ విసిరారు.

నేను మంత్రి అనుకుంటే నన్ను పక్కన బెట్టాలని.. మా పార్లమెంట్ పరిధిలో ఉన్న ముగ్గురు ఎమ్మేల్యేలు మీ పై పోటీకి సిద్దం కేటీఆర్, సిరిసిల్ల నుండి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. నల్గొండ నుండి కోమటిరెడ్డి గారు రాజీనామా చేస్తానని సవాలు విసిరిన సిరిసిల్ల అయినా, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మీరు ఎక్కడ పోటీ చేస్తానన్న మా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అవినీతి మీద జరిగే చర్చ సందర్భంగా భవిష్యత్ లో శిక్ష తప్పదేమోనని కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story