- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana: తెలంగాణ పోలీసులకు పతకాల పంట.. ప్రెసిడెంట్, గ్యాలంటరీ అవార్డులను ప్రకటించిన కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్రం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్, డిఫెన్స్ డిపార్ట్‌మెంట్లలో ఉత్తమ సేవలను అందించిన అధికారులకు కేంద్రం ప్రెసిడెంటల్ మెడల్స్, గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసులకు 21 మెడల్స్ లభించాయి. అందులో ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు చడువు యాదయ్య (హెడ్ కానిస్టేబుల్), విశిష్ట సేవకు ప్రెసిడెంట్ మెడల్ - సంజయ్ కుమార్ జైన్ (అదనపు డీజీపీ ), కటకం మురళీధర్ (డీసీపీ) ఎంపికయ్యారు. అదేవిధంగా మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్-అవినాష్ మొహంతి (పోలీసు కమిషనర్-సైబరాబాద్), జమీల్ బాషా (కమాండంట్), పి.కృష్ణమూర్తి (అదనపు ఎస్పీ), కే.రాము (ఎస్సై), అబ్దుల్ రఫీక్ (ఎస్సై), ఇక్రమ్ అబ్‌ఖాన్ (ఎస్సై), శ్రీనివాస్ మిశ్రా (ఎస్సై), కే.బాలకృష్ణయ్య (ఎస్సై), ఏ.లక్ష్మయ్య (ఎస్సై), జి.వెంకటేశ్వర్లు (ఎస్సై), నూతలపాటి జ్ఞాన సుందరి (ఇన్‌స్పెక్టర్) ఉన్నారు. మెడల్ ఫర్ గ్యాల్లాంటరీ అవార్డుకు సునీల్ దత్ (ఎస్పీ), మోర కుమార్ (రిజర్వ్ ఇన్‌స్పెక్టర్), శనిగరపు సంతోష్ (రిజర్వ్ ఎస్సై), ఏ.సురేష్ (జూనియర్ కమాండో), వి.వంశీ (జూనియర్ కమాండో), కంపాటి ఉపేందర్ (జూనియర్ కమాండో), పాయం రమేష్ (జూనియర్ కమాండో ) ఎంపికయ్యారు.