TS: కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 'కీ' విడుదల

by GSrikanth |   ( Updated:2022-08-30 13:29:12.0  )
TS: కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కీ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష గత ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా.. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన 'కీ'ని రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ 'కీ'ని పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కీ పేపర్‌లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని అభ్యర్థులను కోరింది. ఈ నెల 31న ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షను 91 శాతం మంది అభ్యర్థులు రాశారు.

కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Next Story

Most Viewed