రైతు సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Kalyani |
రైతు సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మహేశ్వరం: రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలం దుబ్బచర్ల, కందుకూరు మండలం రాచులూరు రైతు వేదికల్లో రైతు దినోత్సవంలో పాల్గొని రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతంగానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు.

ఐదు సంవత్సరాలలో విడుతల వారీగా లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఎరువుల కోసం రైతులు చెప్పులు లైన్ లో, పోలీసుల సహాయంతో ఎరువులను పంపిణీ చేసేవారన్నారు. నేడు సకాలంలో రైతాంగానికి కావాల్సిన ఎరువులను ప్రభుత్వం అందిస్తుందన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపుతూ నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ, రైతులు నష్టపోకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ ఆర్డీవో సూరజ్ కుమార్, దుబ్బచర్ల గ్రామ సర్పంచ్ స్లీవారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story