పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచే స్థానాలివే.. ఆ సెగ్మెంట్‌లో 3 లక్షల మెజార్టీ ఫిక్స్

by GSrikanth |
పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచే స్థానాలివే.. ఆ సెగ్మెంట్‌లో 3 లక్షల మెజార్టీ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఢిల్లీ వేదికగా గురువారం సమావేశం అయ్యారు. అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంపై ఖర్గే దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. 17 స్థానాలకు 17 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రెండు, మూడు స్థానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో 3 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఉండి ఉంటే.. రాష్ట్రానికి నిధులు వస్తాయని అన్నారు.

Advertisement

Next Story