మేడే వేడుకల్లో ఏపీపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-10-10 16:10:51.0  )
మేడే వేడుకల్లో ఏపీపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాలపై తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజల సమస్యలు పక్కనబెట్టి కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ప్రసంగించారు. ఏపీ ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ ఏపీని బాగుచేయబోయేది కేసీఆరే అని అన్నారు. పోలవరం నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం కేసీఆర్ వల్లే అవుతుందని తెలిపారు. సీఎం కేసీఆరేం సినిమా యాక్టర్ కాదని, అయినా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లి జనాలు తండోపతండాలుగా వస్తున్నారని అన్నారు. దేశ ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారని తెలిపారు. మహారాష్ట్రలో అతి త్వరలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed