ఆటో డ్రైవర్‌ అవతారమెత్తిన మంత్రి హరీశ్ రావు (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-13 15:58:37.0  )
ఆటో డ్రైవర్‌ అవతారమెత్తిన మంత్రి హరీశ్ రావు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని రాఘవపురం పట్టణంలో ఆటో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆటో కార్మికుడి డ్రెస్ వేసుకొని, ఆటో నడిపి సందడి చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం భావోద్వేగానికి గురయ్యారు. ఈ బలగాన్ని చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేననిపిస్తోందన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. పదవులు ఉండొచ్చు, పోవచ్చు కానీ ప్రజల ప్రేమ వెలకట్టలేనిది అన్నారు. చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అనిపిస్తోందన్న మంత్రి.. మాటల్లో చెప్పలేకపోతున్నాని, కళ్లలో నీళ్లొస్తున్నాయి భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

Next Story