- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంకా ఢిల్లీలోనే జాగృతి వలంటీర్లు.. ఆ రోజు కోసమే వెయిటింగ్..!
దిశ, తెలంగాణ బ్యూరో: భారత, తెలంగాణ జాగృతి వలంటీర్లు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నెల 11న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎమ్మెల్సీ కవితను విచారించింది. ఆ రోజూ కవితను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగడంతో భారత్ జాగృతికి చెందిన వలంటీర్లు వందల సంఖ్యలో వెళ్లారు. వీరితో పాటు టీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నాయకులు సైతం వెళ్లారు. కొంతమంది మరుసటి రోజు రాగా, మరికొంతమంది అక్కడే ఉన్నారు. వారికోసం హోటళ్లు బుక్ చేసినట్లు సమాచారం. అయితే ఈ నెల 16వ తేదీన మరోసారి ఈడీ విచారణ నేపధ్యంలో వచ్చి వెళ్లడం కంటే అక్కడే ఉండాలని సూచించిచడంతో మహిళా జాగృతి నేతలు, వలంటీర్లు, టీఆర్ఎస్వీ నాయకులు అక్కడే ఉన్నారు. వారంతా 16 తర్వాత హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది.
అరెస్టు చేస్తే ఆందోళనలకు సన్నద్ధం..
కవితను ఈ నెల 16న ఈడీ అధికారులు మరోసారి విచారించనున్నారు. అయితే ఇప్పటికే చార్జీషీట్లో పేరు ఉండటం, ఇప్పటికే అదుపులోకి తీసుకొని నిందితుల రిమాండ్ లో సైతం కవిత పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో మరోదఫా కవితను విచారిస్తున్న నేపథ్యంలో అదే రోజు అరెస్టు చేస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో జాగృతి, టీఆర్ఎస్వీ నాయకులు అక్కడే మకాం వేశారు. ఇకవేళ అరెస్టు చేస్తే ఆమెకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలోని ప్రధానకూడళ్లలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. విచారణ రోజూ ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, జాగృతి, విద్యార్థిసంఘం నేతలు భారీగా తరలివెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.