- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ విషయంలో తెలంగాణ దేశంలోనే టాప్..! ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్స్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రసూతి ఆరోగ్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలోనే ముందువరుసలో ఉన్నట్లు తాజా గణాంకాలు పేర్కొన్నాయి. డబ్ల్యూహెచ్‌వో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం ప్రకారం పేదలకు ప్రసూతి ఆరోగ్య కార్యక్రమాలు తెలంగాణలో నూటికి నూరు శాతం అందుబాటులో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మందాల తెలిపారు. 2021-21 సంవత్సరంలో 100 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగిన రాష్ట్రాంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.
ఇదంతా సీఎం కేసీఆర్ దూర దృష్టి, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చొరవతో రాష్ట్రంలోని వైద్యులు, సిబ్బంది కృషితో జరిగిందని తెలిపారు. ఈ మేరకు టీటీజీడీఏ బుధవారం ఓ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు.. ప్రత్యేకించి గైనకాలజిస్టులు, అనస్థీషియా నిపుణులు, శిశువైద్యులు సిబ్బంది అంకితభావంతో చేస్తున్న కృషికి అభినందనలు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.