KTR : తిరోగమన తెలంగాణ! : కేటీఆర్ విమర్శలు

by Y. Venkata Narasimha Reddy |
KTR : తిరోగమన తెలంగాణ! : కేటీఆర్ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో తెలంగాణ తిరోగమన తెలంగాణగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎక్స్ వేదికగా విమర్శించారు. పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, అనుభవరాహిత్యం, అసమర్ధత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో నేడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని ఆరోపించారు. తన వాదనకు మద్ధతుగా కేటీఆర్ అభివృద్ధి సూచీల లెక్కలను పోస్టు చేశారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ అని తెలిపారు.

ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయన్నారు. కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉందని పేర్కొన్నారు. మన పొరుగున ఉన్న అయిదు రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 % నుండి 32% వృద్ధిని నమోదు చేస్తే తెలంగాణ ఒక్కటే గత ఏడాది కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడం రాష్ట్రంలోని విఫల ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. పాలన గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయిస్తే ఫలితాలు ఇలా కాక మరెలా ఉంటాయని ప్రభుత్వా్న్ని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed