- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 9న తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. విడుదల సన్నాహాల్లో బోర్డు!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ఈనెల 9వ తేదీన విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏర్పాట్లపై కసరత్తులు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం బోర్డు అధికారులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా సర్కారు తుది నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రిజల్స్ట్ విడుదల చేయనున్నారు. ఇదిలాఉండగా గతంలో ఇంటర్ ఫలితాల్లో ఎదురైన చిక్కులు, అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకే ఈసారి ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు తలెత్తకుండా ఫలితాలు వెల్లడించాలని అధికారులు తాత్సారం వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌లో గత నెల 26వ తేదీనే ఫలితాలు వెల్లడించడం గమనార్హం.