ఢిల్లీకి గవర్నర్ తమిళిసై.. రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యే చాన్స్?

by GSrikanth |   ( Updated:2023-02-27 10:14:32.0  )
ఢిల్లీకి గవర్నర్ తమిళిసై.. రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యే చాన్స్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కోసం రాష్ట్రపతి భవన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా భేటీకి సంబంధించిన టైమ్ ఫిక్స్ కాలేదు. కేవలం ఒకరోజు పర్యటనే కావడంతో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాకపోతే తిరిగి సోమవారం రాత్రి 11.00 ఫ్లైట్‌కే రిటర్న్ కానున్నారు. ఒకవేళ రాష్ట్రపతితో భేటీ కోసం అపాయింట్‌మెంట్ ఖరారైతే దానికి తగినట్లుగా ప్రయాణంలో మార్పులు చేసుకునే అవకాశం ఉన్నది. పంజాబ్ గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ మనుమరాలి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరు కానున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను కూడా కొద్దిసేపు సందర్శించే అవకాశం ఉన్నది. గవర్నర్ ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story